Magazines

ఈఫిల్‌ టవర్‌ చీఫ్‌నకు పదవీగండం

1 గంట క్రితం

Eiffel Tower
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 2 నిమిషాల చదవడం

రాజీనామా చేయనున్న పాట్రిక్‌ బ్రాంకో రుయివో
హిందూ మత గురువుల పర్యటనలో మహిళలను దూరం పెట్టడంపై వివాదం


పారిస్‌ : హిందూ మత గురువులు ఈఫిల్‌ టవర్‌ను సందర్శించిన సందర్భంగా అక్కడి మహిళా ఉద్యోగులను తొలగించి పురుషులను నియమించడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ టవర్‌ను నిర్వహిస్తున్న సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పాట్రిక్‌ బ్రాంకో రుయివో ఈ ఏడాది చివరలో తన పదవికి రాజీనామా చేయ బోతున్నారు. ఈ విషయాన్ని ఈఫిల్‌ టవర్‌ను నిర్వహిస్తున్న ఎస్‌ఈటీఈ సంస్థ తెలియజేసింది. 2018 నుంచి రుయివో ఈ పారిస్‌ చారిత్రక కట్టడానికి డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. హిందూ మత గురు వుల పర్యటనలో కన్పించిన లోపాలు, వైఫల్యాల కారణంగానే మహిళా సిబ్బందిని ఆమోద యోగ్యం కాని రీతిలో తొలగిం చారని అంతర్గత విచారణలో తేలిందని ఆ సంస్థ తెలిపింది. గత నెల ప్రారంభంలో బోచసన్వాసి అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) కు చెందిన సుమారు వంద మంది ప్రతినిధులతో కూడిన బృందం ఈఫిల్‌ టవర్‌ను సందర్శించి నప్పుడు అక్కడి మహిళా ఉద్యో గినులను తొలగించి పురుషులను నియమించడం వివాదానికి దారితీసింది. 18వ శతాబ్దపు విశ్వా సాలను కలిగిన బీఏపీఎస్‌...ఆలయ కార్యకలాపాలు, భవనాల ప్రవేశ ద్వారాలు సహా అన్ని చోట్ల పురుషులు, మహిళలను వేర్వేరుగా చూస్తుంది.

తమ పర్యటన సమయంలో మహిళలతో సంభాషణలను పరిమితం చేసేలా చూడాలని హిందూ ప్రతినిధి బృందం అభ్యర్థించిందని, అయితే వారి షరతులకు అంగీకరించకుండా ఉండాల్సిందని ఎస్‌ఈటీఈ అభిప్రాయపడింది. పని ప్రదేశాలను విడిచి వెళ్లిపోవాలని మహిళలకు సూచించారని, దీంతో వారు అవమానానికి గురయ్యారని సిబ్బందికి చెందిన ఓ సంఘం ప్రతినిధి చెప్పారు. ప్రతినిధి బృందం ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలలో తిరగవద్దని మహిళా ఉద్యోగులకు చెప్పారని కూడా ఆయన తెలిపారు. ఈ చర్యతో ఆగ్రహించిన సిబ్బంది సమ్మెకు దిగడంతో ఈఫిల్‌ టవర్‌ను మూసివేశారు. ఈ ఘటనను పలువురు రాజకీయ నేతలు ఖండించారు. విదేశీ సంద ర్శకుల డిమాండ్లను తీర్చడానికి మహిళలను పక్కకు తప్పు కోవాల్సిందిగా బలవంతం చేయ డాన్ని తాను అంగీకరించనని ఫ్రాన్స్‌ జాతీయ అసెంబ్లీ అధ్య క్షురాలు యూఎల్‌ బ్రాన్‌-పివెట్‌ అన్నారు. ఇది అసంబద్ధమైన, అన్యా యమైన, ఆమోదయోగ్యం కాని చర్య అని పారిస్‌ సోషలిస్ట్‌ మేయర్‌ ఇమ్మానుయేల్‌ గ్రెగోయిర్‌ చెప్పారు. కాగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, శిక్షణా కార్యక్రమాలు అమలు చేయాలని కోరామని ఎస్‌ఈటీఈ ఛైర్మన్‌ ఏరియల్‌ వెయిల్‌ తెలిపారు. 18వ శతాబ్దపు విశ్వాసాలకు నేటి ప్రపంచంలో స్థానం లేదని, మతపరమైన ఆచారాల పేరుతో మహిళలను దూరంగా ఉంచడం వివక్షాపూరితమని పలువురు విమర్శ కులు అభిప్రాయపడ్డారు. తమ చర్యతో ఎవరికైనా బాధ కలిగినా, అసౌకర్యం కలిగినా క్షమించాలని బీఏపీఎస్‌ కోరింది. పరస్పర గౌరవం, సేవ అనే సార్వత్రిక విలువలను గౌరవిస్తామని తెలి పింది. ఈ సంస్థకు లండన్‌, లాస్‌ఏంజెల్స్‌, సిడ్నీ సహా పలు నగరాలలో దేవాలయాలు ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్