వారంలో 15 బిలియన్ డాలర్లు పతనం
న్యూఢిల్లీ : భారత విదేశీ మారకం నిల్వల్లో మారోవారం తగ్గుదల చోటు చేసుకుంది. సెప్టెంబర్ 18తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 14.881 బిలియన్ డాలర్లు క్షీణించి 765.901 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు వారంలో ఈ నిల్వలు 4.924 బిలియన్ డాలర్లు తగ్గి 780.782 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ వారంలో ఫారెక్స్ నిల్వలు భారీగా తగ్గడానికి ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు పడిపోవడమే కారణమని ఆర్బీఐ డేటా స్పష్టం చేసింది. భారత్ ఫారెక్స్ నిల్వల్లో సింహభాగం ఆక్రమించే విదేశీ కరెన్సీ ఆస్తులు సమీక్షా వారంలో ఏకంగా 14.816 బిలియన్ డాలర్లు క్షీణించి 630.980 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
మరోవైపు దేశీయంగా బంగారం నిల్వలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. సమీక్షా వారంలో భారత్ బంగారం నిల్వలు 68 మిలియన్ డాలర్లు పెరిగి 111.292 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత్ కలిగి ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 106 మిలియన్ డాలర్లు తగ్గి 18.739 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
తగ్గిన విదేశీ మారకం నిల్వలు
3 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)