తిరుపతి, సెప్టెంబర్ 28, 2026: హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ దేశవ్యాప్తంగా మహిళల్లో ఆర్థిక అవగాహన , పెట్టుబడులపై అవగాహన కలిగించడానికి 'నారీ నివేశ్ యాత్ర'ను నిర్వహించింది. చెన్నైలో జూన్ 26న జెండా ఊపి ప్రారంభించిన ఈ యాత్ర తన తిరుపతి విడతను విజయవంతంగా ముగించింది. కుటుంబ ఆర్థిక నిర్ణయాలలో మహిళల పాత్ర కీలకమైన నేపథ్యంలో, ఆరు నెలల పాటు సాగే ఈ కార్యక్రమం ద్వారా కమ్యూనిటీల దగ్గరికే ఇన్వెస్టర్ విద్యను తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ యాత్రలో భాగంగా ప్రత్యేక వాహనాలు (కాంటర్లు) వివిధ ప్రాంతాలలో ప్రయాణిస్తూ, వీధి నాటకాలు , ఇంటరాక్టివ్ సదస్సుల ద్వారా సులభమైన రీతిలో ఆర్థిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నాయి. తిరుపతిలోని కోర్లకుంట, తిరుపతి మార్కెట్, లీలామహల్, గాంధీ రోడ్ వంటి పలు ప్రధాన మార్కెట్లలో స్థానిక మహిళలతో ఈ యాత్ర మమేకమైంది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలతో 60 ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి, ఆర్థిక ప్రణాళిక , దీర్ఘకాలిక సంపద సృష్టి ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.
సంప్రదాయ పొదుపు పద్ధతులను దాటి, సరైన సమాచారంతో కూడిన పెట్టుబడుల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించే 'బర్నీ సే ఆజాది' కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ యాత్ర రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ప్రయోజనాలు అయిన మార్కెట్ సమయాన్ని లెక్కించాల్సిన అవసరం లేకపోవడం, దీర్ఘకాలిక సంపద సృష్టి , క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానాల గురించి వివరించారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కేవైసీ (KYC) పూర్తి చేసే విధానం, సెబీ ఆమోదిత రిజిస్ట్రేషన్ వివరాలు , ఫిర్యాదుల పరిష్కారం కోసం స్కోర్స్ (SCORES) లేదా స్మార్ట్ ఓడీఆర్ (Smart ODR) వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయని హెచ్చరిస్తూ, పథకానికి సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవాలని పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)