నవతెలంగాణ - హైదరాబాద్: బడంగ్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాదర్‌గుల్‌కు చెందిన ఏనుగు ప్రసన్నలక్ష్మి స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా ఆటో రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో ఆమె కిందపడగా, పక్కనే వెళ్తున్న ట్రాక్టర్ ఆమెపై నుంచి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో ప్రసన్నలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బడంగ్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
47 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)