Magazines

బొక్కలగుట్ట సర్వీసు రోడ్డుకు చర్యలు ముమ్మరం

2 రోజుల క్రితం

service road
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-రామకృష్ణాపూర్
బొక్కలగుట్ట గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు సర్వీసు రోడ్డు, అండర్‌బ్రిడ్జి, సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ తెలిపారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఆదేశాల మేరకు బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ సమీపంలోని జాతీయ రహదారి ప్రాంతాన్ని మంగళవారం డీసీపీ భాస్కర్‌ పరిశీలించారు. రాళ్లవాగు నుంచి మంచిర్యాల వైపు సర్వీసు రోడ్డు లేకపోవడంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.


ఈ విషయాన్ని పోలీసుశాఖ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అండర్‌బ్రిడ్జి, సర్వీసు రోడ్డు ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో రాత్రివేళ చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నేషనల్‌ హైవే అథారిటీ సహకారంతో 14 సెంటర్‌ లైటింగ్‌ పోల్స్‌ ఏర్పాటు పనులు చేపడుతున్నారు. ఈ ఏర్పాట్లతో ప్రమాదాల నివారణకు తోడ్పాటు అందుతుందని అధికారులు తెలిపారు. పరిశీలనలో మందమర్రి సీఐ పి.రమేశ్‌, ఆర్కేపీ ఎస్సై జై శ్రీధర్‌, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు, స్థానిక సర్పంచ్‌ శ్రీనివాస్‌, బొలిశెట్టి కనకయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్