Magazines

సెలవు రోజుల్లో తరగతుల నిర్వహణపై ఎస్‌ఎఫ్‌ఐ ఆగ్రహం

1 గంట క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కాప్రా : ఈసీఐఎల్ పరిధిలోని శ్రీచైతన్య పాఠశాలల్లో ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై తక్షణమే విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) కాప్రా మండల కమిటీ డిమాండ్ చేసింది.

ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ కాప్రా మండల అధ్యక్షుడు శ్యామ్‌రావు మాట్లాడుతూ, విద్యాశాఖ నిర్దేశించిన నిబంధనలను అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. విద్యార్థులకు విశ్రాంతి కల్పించాల్సిన ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.

విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి విశ్రాంతి కూడా అవసరమని, సెలవు దినాల్లో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశంపై కాప్రా మండల ఎంఈఓ వెంటనే స్పందించి సంబంధిత పాఠశాలలను తనిఖీ చేసి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.

ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయితే విద్యాశాఖ నిబంధనల ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. విద్యార్థుల హక్కులు, సంక్షేమం పరిరక్షణలో అధికారులు చొరవ చూపాలని శ్యామ్‌రావు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్