Magazines

ప్రారంభోత్సవ ఆఫర్ తెచ్చిన తంటా...

1 గంట క్రితం

offer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆర్మూర్ : పట్టణ పరిధిలోని  విజయ్ పబ్లిక్ స్కూల్ , ఎం జె హాస్పిటల్ కు వెళ్లే ప్రధాన రహదారిపై  ఆదివారం ఉదయం  కిడ్స్ వరల్డ్ ఇది పిల్లల ప్రపంచం షాపు ప్రారంభించారు. ప్రారంభం అయిన కొద్దిసేపటికి నాన హంగామా జరిగింది.స్పెషల్ ఆఫర్ గా గర్ల్స్ ప్లాజో 39 రూపాయలు, కార్డ్స్ సెట్టు 69 రూపాయలు ,ప్రారంభోత్సవ కానుకగా తొమ్మిది రూపాయలకే టీ షర్ట్  అంటూ ప్రారంభించారు. .దీంతోచుట్టుపక్కల గ్రామాల నుండి సైతం జనాలు ఒక్కసారిగా ఏగబడ్డారు. కొందరు మహిళలు షాపులోకి చొరబడి బట్టలను సైతం తీసుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేయడం షాపు నిర్వాహకులకు అర్థం కాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి పోలీస్ సిబ్బందితో విచ్చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. గత సంవత్సరం క్రితం సైతం పట్టణంలోని పంకి బాయ్స్ యందు ఇటువంటి సంఘటన జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్