Magazines

టీఎస్‌టిటీఎఫ్ అశ్వారావుపేట నూతన మండల కమిటీ ఎన్నిక

43 నిమిషాల క్రితం

khammam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

- అధ్యక్షుడిగా జగ్యా.. ప్రధాన కార్యదర్శిగా వెంకన్న బాబు

నవతెలంగాణ - అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం టీఎస్ టీటీఎఫ్ (తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్) నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎస్‌టిటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చౌహాన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్, రాష్ట్ర సలహాదారు ఎల్‌వీబీఎం రత్నాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌జీటీ ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, జీవో నెం.3ను పునరుద్ధరించాలని, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న భాషా పండితులకు అప్‌గ్రేడేషన్ కల్పించాలని, ఆశ్రమ జీపీఎస్ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

అనంతరం టీఎస్‌టిటీఎఫ్ అశ్వారావుపేట మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీ ఇలా ఉంది:

* గౌరవ అధ్యక్షుడు: లకావత్ జేత్య

* అధ్యక్షుడు: జరుపల జగ్గయ్య

* ప్రధాన కార్యదర్శి: మాలోత్ వెంకన్న బాబు

* కోశాధికారి: భూక్య నరసింహ

* ఉపాధ్యక్షుడు: కున్సోద్ గంగాధర్

* వర్కింగ్ ప్రెసిడెంట్: తేజావత్ బాలు నాయక్

ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి భూక్య శోభన్, భూక్య రాజు, మంగమ్మ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్