Magazines

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం

46 నిమిషాల క్రితం

Cheddi gang
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ప్రవేశించారు. నివాసంలోకి చొరబడి దొంగతనానికి పాల్పడుతుండగా, ఒక మహిళ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన దుండగులు ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆరుగురు సభ్యులు అపార్ట్‌మెంట్‌లోని ఒక బ్లాక్‌లో సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ల వాసులు భయాందోళన చెందుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్