Magazines

నశా ముక్త్ యువతతోనే వికసిత్ భారత్ సాధ్యం

1 గంట క్రితం

Nellikuduru
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే కుమారస్వామి

​నవతెలంగాణ-నెల్లికుదురు

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రమ్య యువతకు పిలుపునిచ్చారు.నశా ముక్త్ యువ – వికసిత్ భారత్” కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులు, యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక మరియు ఆర్థిక నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే కుమారస్వామి, స్థానిక వైద్యాధికారి డాక్టర్ రమ్య తో కలిసి వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి భవిష్యత్తుతో పాటు కుటుంబం మరియు సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు.

యువత తమ శక్తి, ప్రతిభను విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సృజనాత్మకత మరియు సామాజిక సేవ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మళ్లించాలని సూచించారు. మత్తు రహిత యువతే దేశానికి బలమైన మానవ వనరు అని పేర్కొన్నారు. ప్రతి యువకుడు, యువతి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటానని సంకల్పించడంతో పాటు, తన స్నేహితులు మరియు సమాజంలోని ఇతర యువతను కూడా మత్తు వ్యసనాల నుంచి కాపాడేందుకు అవగాహన కల్పించాలని కోరారు. ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు నశా ముక్త్ భారత్ సందేశాన్ని గ్రామాలు, విద్యాసంస్థలు మరియు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు సుధాకర్, యాకన్న, రామ్మూర్తి అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్