Magazines

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లాను: సీఎం రేవంత్‌రెడ్డి

49 నిమిషాల క్రితం

Assembly
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లానంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఢిల్లీ వేదికగా జరిగిన ‘ప్రతిదిన్ కాంక్లేవ్’లో తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్’ అనే అంశంపై ప్రసంగించిన ఆయన  తన రాజకీయ ప్రయాణం, విద్యార్థి రాజకీయాలు, జాతీయ రాజకీయాలపై అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లానని తెలియజేశారు.


తాను 2006లో జడ్పీటీసీగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచానని, ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించానని సీఎం రేవంత్‌ గుర్తుచేసుకున్నారు. 2014 తర్వాత తెలంగాణ రాజకీయాలు ‘కేసీఆర్ వర్సెస్ రేవంత్’గా మారాయని, ఆ సమయంలో కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని సీఎం ఆరోపించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు, కేంద్రంలో ఎన్డీఏతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.


ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో రాజకీయాల శైలి భిన్నంగా ఉంటుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదని అన్నారు. ఏబీవీపీలో . రాహుల్ గాంధీకి ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవని, దేశమే ఆయనకు ముఖ్యమని రేవంత్ ప్రశంసించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్