నవతెలంగాణ - అశ్వారావుపేట
గాంధీ జయంతిని పురస్కరించుకుని పీజే టీజీ ఏయూ (ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం) ఆధ్వర్యంలో అక్టోబర్ 2 న నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థి ప్రతిభ కనబరిచారు. తెలంగాణ రాష్ట్రంలోని 15 వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
తెలుగు వ్యాసరచన పోటీలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న జి. క్రాంతికుమార్ ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు క్రాంతికుమార్‌ను అభినందించారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయ స్థాయి పోటీలో ప్రథమ బహుమతి సాధించడం కళాశాలకు గర్వకారణమని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)