Magazines

కార్మిక, కర్షకుల పిల్లలు చదివే విద్యాలయాల బలోపేతానికి కృషి

1 గంట క్రితం

education
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

- రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

నవతెలంగాణ - తొగుట

 విద్యార్థులు బాగా చదివి ఉన్నత పదవులు పొందాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. మంగళవారం రాంపూర్ గురుకుల పాఠశాల, కళాశాలను పరిశీ లించారు. గురుకులంలో ఉన్న సమస్యల పరిష్కా రానికి సహకరించాలని ప్రిన్సిపల్ చైర్మన్ కు విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మి కుల కర్షకుల పిల్లలు చదువుకునే విద్యాలయానికి సహకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. స్వర్గీయ మాజీ మంత్రి మా గురువు చెరుకు ముత్యం రెడ్డి కృషి వల్ల ఈ గురుకులం స్థాపించబ డిందన్నారు. ఏ సౌకర్యాలు లేని మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఒక గుర్తింపు తీసుకువ చ్చిన నాయకుడు ముత్యంరెడ్డి అని కొనియాడారు.


నియోజకవర్గ స్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్య క్రమాలు చేసిన ఘనత కమిటీకి దక్కుతుందన్నా రు. ఈరోజు నాకు అవకాశం దక్కిందంటే ఆయన చెరువుతో నేను ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసు కున్నారు. అలాంటి గురుకులానికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా నా వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వివి ధ శాఖల అధికారులు, తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ నవీన్, స్థానిక మండల అధికారులు ఎంపీడీఓ నర్సింహారెడ్డి, తహసీల్దార్ మహమ్మద్ సమీర్ హమ్మద్ ఖాన్, ఎంఈవో వి. నర్సయ్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్