Magazines

ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం.. రూ.29.15 కోట్ల నష్టం

1 గంట క్రితం

Misuse
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

- రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలకు రంగం సిద్ధం
- లేకుంటే ఆర్‌ఆర్‌ చట్టం కింద ఆస్తుల జప్తు, వేలం.
- తహసీల్దార్ కృష్ణమోహన్ హెచ్చరిక.
నవతెలంగాణ - రాయపోల్

రాయపోల్‌ మండలం వడ్డేపల్లి గ్రామంలోని ఎంఎస్‌ శ్రీ సాయి వీరభద్ర రైస్‌ ఇండస్ట్రీస్‌ యాజమాన్యం ప్రభుత్వ వరి ధాన్యం నిల్వలను దుర్వినియోగం చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.29,15,49,811 నష్టం వాటిల్లిందని తహసిల్దార్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన నివేదికలు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ తెలిపారు.

ఈ మొత్తాన్ని సదరు యాజమాన్యం నుంచి వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ మేరకు రాయపోల్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి సెప్టెంబర్‌ 29న నోటీసు జారీ చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.29.15 కోట్లను 15 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా బకాయిని చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం-1864లోని సెక్షన్‌ 5 ప్రకారం సంస్థకు సంబంధించిన చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేసి ప్రభుత్వ బకాయిలను వసూలు చేస్తామని తహసిల్దార్ స్పష్టం చేశారు.ఈ వ్యవహారం పై గతంలో జిల్లా కలెక్టర్‌, ప్రొసీడింగ్స్‌, తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా జారీ చేసిన నోటీసులు, ఆదేశాలను ప్రస్తావిస్తూ తాజా నోటీసు జారీ చేసినట్లు తహసిల్దార్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్