హీరో శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించ బోతున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా నుంచి ‘ఎత్తర ఎత్తు..’ పాటని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ రివల్యూషనరీ ఫ్లేవర్ ఉన్న పాటను కంపోజ్ చేశారు. నల్గొండ గద్దర్ నర్సన్న తన ప్రత్యేక మైన వాయిస్‌తో పవర్‌ఫుల్ ఎనర్జీని అందించగా, భాస్కర భట్ల రాసిన లిరిక్స్ పాటకు రివల్యూషనరీ ఫీల్‌ను తీసుకొచ్చాయి. శ్రీ విష్ణు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, పాటలోని బీట్, లిరిక్స్ కలిసి ఫుల్ ఎనర్జిటిక్ స్ఫూర్తి నింపే పాటగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల, సమర్పణ: కోన వెంకట్, నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి, సంగీతం: విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఎడిటర్: చోటా కె. ప్రసాద్.
‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్‌కి రెడీ
45 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)