Magazines

యరగండ్లపల్లిలో విబి- గ్రామ్ జి పై గ్రామసభ

1 గంట క్రితం

vbg ramji
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో విబి-గ్రామ్ జి పై రెండవ గ్రామ సభ నిర్వహించారు.ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం గ్రామసభను నిర్వహించారు.గ్రామసభలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.విబి- గ్రామ్ జి  కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి,వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు తీర్మానాలు చేశారు.


గ్రామంలో అవసరమైన సీసీ రోడ్లు,కాంపౌండ్ వాల్స్,రైతులకు ఉపయోగపడే పనులు,గుట్టలకు కందకాలు,నీటి సంరక్షణ,భూసార పరిరక్షణ తదితర పనులను గుర్తించి,రాబోయే కాలంలో చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించడంపై చర్చించారు.అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలోని కూలీలకు సరిపడా పనులు కల్పించే విధంగా అవసరమైన పనులను గుర్తించి,వాటికి సంబంధించిన తీర్మానాలు చేశారు.గ్రామంలో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు రైతులకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో చర్చించారు.


గ్రామంలో నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని,ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తవ్వుకునేలా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి,ఇంటింటికీ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడు ముందుండి పని చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జిసి మున్నయ్య,ఎంపీఓ రవికుమార్,ఈసీ వివేక్,ఉపసర్పంచ్ కృష్ణమ్మ,పంచాయతీ కార్యదర్శి శ్రావణ్,వార్డు సభ్యులు,ఏఈఓ శ్రీలత,ఆశా వర్కర్లు,ఫీల్డ్ అస్సిటెంట్ శ్రీశైలం,ఏఎన్‌ఎంలు,మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్