నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘాల పాలక వర్గ సభ్యులకు ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని ఐకేపీ ఏపియం జగదీష్ కుమార్ తెలిపారు. ఈ శిక్షణకు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లు శృతి, శారద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో సంఘాల గ్రేడింగ్ చేసే విధానం పైన ఉండే ఏడు రకాల కొలమానాలు (పారామీటర్) గురించి వివరించడం జరిగింది. సంఘాల సమావేశాల నిర్వహణ, సభ్యుల హాజరు, తప్పనిసరి పొదుపులు, ఆన్లైన్ లావాదేవీలు, సభ్యుల రుణం చెల్లింపులు, బ్యాంకులకు స్త్రీ నిధి సంస్థలకు చేసే చెల్లింపులు మొదలగు అంశాలలో మార్కులు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మార్కుల ఆధారంగానే. ఏ గ్రేడ్, బి గ్రేడ్ సి గ్రేడ్ డీ గ్రేడ్ లు గా సంఘాలు, గ్రామ సంఘాలు మండల సమాఖ్య లను కొలవడం జరుగుతుంది. వీటి ఆధారంగానే నిధులు మంజూరు అవుతాయి అని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు హసీనా బీ, కార్యదర్శి ప్రేమల కోశాధికారి అనీషా తో పాటు వివిధ గ్రామ సంఘాల అధ్యక్షురాళ్ళు సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్లు (0)