ఆర్.సీత,పీ ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు
నవతెలంగాణ ఆలేరు రూరల్
హైదరాబాద్ లోని తుక్కుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన నిరుపేద శిరీష ను దారుణంగా హత్య,అత్యాచారం చేయడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం(పీ ఓ డబ్ల్యూ)తీవ్రంగా ఖండిస్తుంది.ప్రజలు,ప్రజాస్వామిక వాదులు, ప్రగతిశీల శక్తులు, మహిళలు అందరూ ఖండించాలని పీ ఓ డబ్ల్యూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత విజ్ఞప్తి చేశారు.శిరీషను హత్య చేసిన హంతకున్ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ఇలాంటి దుర్మార్గాలు పునరావృతం కాకుండా తగిన గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆలేరు మండలం మందనపల్లి లో శిరీష హత్యను ఖండిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీత మాట్లాడుతూ,మనుషులలో ముఖ్యంగా యువత,విద్యార్థులలో మానసిక పరివర్తన లో మార్పు అనేది చాలా ముఖ్యమని,అందుకు ప్రస్తుత వ్యవస్థ లో పాదుకుపోయిన అసభ్యత,అశ్లీలత,మహిళలను, విద్యార్థినీలను,అమ్మాయిలను గౌరవించలేని సంస్కృతిని రూపుమాపాల్సిన అవసరం ఉందని అన్నారు.
సమాజానికి అందిస్తున్న పాఠ్యాంశంలోని (సిలబస్)బోధనలు మారాలని,శాస్త్రీయత లేని,ఎదుటి వారిని గౌరవించలేని విష సంస్కృతి యువతను ఇలాంటి అరాచకాలకు పురిగొల్పుతోందని అన్నారు.మద్యం డ్రగ్స్ అశ్లీలత తదితర సాంఘిక దురాచారాలను నిషేధించడం మూలంగా యువతలో కొంతమేరకైనా మార్పును తీసుకురావడానికి దోహదపడుతుందని అందుకు పాలకులు ఈ దిశగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ సందర్భంగా నే గంగసాని సరోజిని ఏలియాస్ సీతక్క సిపిఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ నాయకురాలు,ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షురాలు,గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసిన సీతక్కకు ఘనంగా విప్లవ జోహార్లు తెలిపారు.
ఈ కార్యక్రమములో పీ ఓ డబ్ల్యూ జిల్లా నాయకురాలు మరియు మదనపల్లి గ్రామ ఉపసర్పంచ్ పద్మ శశిరేఖ,పి ఓ డబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి తమ్మడి మాధవి,పీ ఓ డబ్ల్యూ ప్రతినిధులు తమ్మడి ఉమా,కడకంచి పద్మ,కడకంచి అనిత,దార సుగుణ,బేతి లక్ష్మి,దొప్ప ప్రమీల,పద్మ సుస్మిత, మారేబోయిన శ్రీలత,పంగ అండాలు, డొంకెన లక్ష్మీనర్సమ్మ,సత్తెమ్మ, అండాలు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)