Magazines

108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం

05 ఆగస్టు, 2026

108
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆర్మూర్ 
జక్రాన్ పల్లి మండల పరిధిలోని కలిగోట్ గ్రామానికి చెందిన కమ్మరి సోని అనే గర్భిణికి బుధవారం అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. క్షణాల్లో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమయ్యాయి. పరిస్థితిని గమనించిన ఈఎంటి రాథోడ్ జగదీష్, పైలట్ నరేందర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం జరిపారు. సకాలంలో ప్రసవం జరగడంతో తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం వారిని ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడి, సురక్షితంగా ప్రసవం జరిపించిన 108 ఈఎంటి జగదీష్, పైలట్ నరేందర్‌లను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్