Magazines

సూర్య వంశీ మాదిగ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం విజయవంతం

47 నిమిషాల క్రితం

medical camp
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం గాంధీ జయంతి పూరష్కరించుకొని దళిత నాయకుడు, ప్రజ సేవకుడు సూర్యావంశి యాదవ్ మాదిగ ఆధ్వర్యంలో సెవెన్ హిల్స్ ఆసుపత్రి బాన్స్వాడ వారి సహకారంతో మేగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సూర్యావంశీ యాదవ్ మాట్లాడుతూ.. జుక్కల్ నియోజక వర్గ ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ నియోజక వర్గం చాలా వెనుక పడ్డ ప్రాంతం ఈ ప్రాంతం లో నిరుపేద కుటుంబాలు ఉన్నందు వలన ఎవరు అనారోగ్యానికి గురికావొదని ఉదేశ్యం తో ఈ ఉచిత వైద్య మెగా శిభిరం నిర్వహించమని తెలిపారు.


ప్రతి నెల ఒక్కో మండల కేంద్రం లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమం లో వైద్యులు వాగ్దేవి ఎండి ఫిజీసియాన్, దివ్య భవాని గైనకాలజిస్ట్, శ్రీనివాస్ ఆర్థో, మధుకర్ జనరల్ సర్జన్, స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నాగనాథ్ పటేల్ సంగమేశ్వర్ నాయకులు పండిత్ రావ్ పటేల్, విజయ్, హనుమంత్  ఆయా పార్టీల నాయకులు వ్యాపారస్తులు చికిత్సల కోసం వచ్చిన మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్