Magazines

మేజర్‌ గ్రామపంచాయతీలో గ్రామసభ

1 గంట క్రితం

Gramasabha
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న వి బి జి రామ్ జి పథకంలో గ్రామ అవసరాల కోసం అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రత్యేక గ్రామసభల్లో భాగంగా గాంధీ జయంతి రోజున మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అధ్యక్షతన విబిజి రాంజీ పథకంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో గ్రామ అవసరానికి కావలసిన పనులపై చర్చించారు. ఈ గ్రామ సభకు మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఏపీవో పద్మ అదేవిధంగా గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తెప్ప తుకారం వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్