Magazines

'మహాత్మా గాంధీ' నేటి తరానికి స్ఫూర్తిదాయకం 

1 గంట క్రితం

Mahatma Gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

- సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

- కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు 

నవతెలంగాణ-సత్తుపల్లి

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణతో పాటు, ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కోపానికి కోపంతో కాకుండా ప్రేమతోనే సమాధానం చెప్పాలని అని గాంధీజీ పలికిన సూక్తిని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మరో సందర్భంలో ఆయన అన్నట్లుగా ప్రపంచంలో మనం చూడాలనుకునే మార్పును మొదట మనలోనే ప్రారంభించాలని గాంధీజీ పిలుపునిచ్చారన్నారు.


గాంధీజీ మహోన్నత ఆశయాలకు అనుగుణంగా శాంతియుత, స్వచ్ఛమైన సమాజ నిర్మాణానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దామని ఆకాంక్షించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్  మొహమ్మద్ రెహానా కమల్, ​మున్సిపల్ కమిషనర్  కోండ్ర నరసింహ, ​ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు,

​పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, ​నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, బొంతు వేణు, మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్