Magazines

కేసీఆర్ పాలనలోనే పేదింట కళ్యాణ కాంతులు

1 గంట క్రితం

Kcr
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

- ఆడబిడ్డలకు మేనమామలా ఆర్థిక భరోసా

- దశల వారీగా రూ.1,00,116లకు పెంపు

- నేటితో పన్నెండేళ్ళ పధకం ప్రస్తానం పూర్తి

- కృతజ్ఞతగా కేసీఆర్ ఫ్లెక్సీకి బీఆర్ఎస్ నేతల క్షీరాభిషేకం

నవతెలంగాణ - అశ్వారావుపేట

కేసీఆర్ పాలనలోనే పేదల ఇంట్లో కళ్యాణ కాంతులు విరజిల్లాయని బీఆర్ఎస్ నేతలు జేకేవీ రమణారావు, యూఎస్ ప్రకాశావు, సంకా ప్రసాద్, మందపాటి రాజ మోహన్ రెడ్డిలు స్పష్టం చేశారు. పేద యువతుల పెండ్లికి కేసీఆర్ మేనమామ లా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించారని అన్నారు. అక్టోబర్ 2 తో పథకం అమల్లోకి వచ్చి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలి లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ప్రజల తరుపున కృతజ్ఞతగా పాలాభిషేకం చేశారు.


అనంతరం వారు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం పధకాన్ని రూ.51 వేల నుండి దశల వారీగా రూ.1,00,116లకు పెంచి నిరుపేద కుటుంబాల్లో పెద్దన్న పాత్ర పోషించారని సంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాది పేద కుటుంబాలకు పథకం ఆలంబనగా నిలిచిందని, అటువంటి పధకాన్ని ఇందిరమ్మ పాలనలో నిరాధరణకు గురి చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆడబిడ్డల సంక్షేమానికి స్వర్ణ యుగమని, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అమలు సాద్యం కాని హమీలతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇందులో బాగంగానే కళ్యాణలక్ష్మీ తో పాటు తులం బంగారం ఇస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత అడబిడ్డల ఆశలను అడియాశలు చేశారని ద్వజమెత్తారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నారం రాజశేఖర్, చిప్పనపల్లి బజారయ్య, ఆరేపల్లి రాంబాబు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్