Magazines

భవన నిర్మాణానికి భూమిపూజ

59 నిమిషాల క్రితం

Groundbreaking
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండల కేంద్రంలో వెనుక బడిన తరగతుల కమిటీ భవన నిర్మాణానికి శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే  పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీడీసీ కమిటీ భవనంఅందుబాటులోకి వస్తే సంబంధిత వర్గాలకు మరింత సౌకర్యం కలుగుతుందని అన్నారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో  బీడీసీ అధ్యక్షుడు విఠల్, వెంకటేష్, సభ్యులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్