జిల్లా కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్
నవతెలంగాణ - దర్పల్లి
రాష్ట్రంలోని ప్రతి తండాలో గుడిసెలేని తాండలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ అన్నారు. గురువారము ఆయన మండల అధ్యక్షుడు గాదె నరేష్ తో కలిసి, మండలంలోని ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా
ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు లేని పేదలకు ఇండ్లు నిర్మించి, సమాజంలో వారికీ తలెత్తు కుని తిరిగేలా వారిని సమాజంలో గౌరవంగా ఉంచేందుకు కాంగ్రేస్ పార్టీ ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమములో గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)