Magazines

ఘనంగా ఏఎమ్మార్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

53 నిమిషాల క్రితం

AMR
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

ఏఎమ్మార్ లిమిటెడ్ కంపెనీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన  ఏఎమ్మార్ లిమిటెడ్ కంపెనీ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఓసిపి బ్లాక్-1 క్యాంపులో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


ముందుగా సాయి బాబా విగ్రహానికి అభిషేకం, పూజలు వేదపండితులచే నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఉద్యోగులకు, కార్మికులకు ఏఎమ్మార్ కంపెనీ టీషర్ట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులు, కార్మికులందరూ సేఫ్టీ బాధ్యతతో డ్యూటీ చేయాలనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కెఎస్ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, జి.ఎమ్ మెకానికల్ విశ్వ ప్రసాద్, హెచ్ ఆర్ డి.జి.యమ్ రమేష్ బాబు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్