Magazines

జీవాలకు బీమా...యజమానులకు ధీమా!

59 నిమిషాల క్రితం

Cattle insurance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం



-రూ.13ప్రీమియంతో రక్షణ.


-మండలంలో మొత్తం 39,178జీవాలు


నవతెలంగాణ-మల్హర్ రావు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలి చిన గొర్రెలు,మేకల పెంపకందారులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.ఒకప్పుడు అంతుచి క్కని వ్యాధులు,వర్షాకాలంలో జరిగే నష్టాలతో కుదేలైన జీవాల పెంపకందారులకు ఇకపై పూర్తి భరోసా దక్కనుంది.కేవలం నామమాత్రపు ప్రీమియంతో వాటికి బీమా రక్షణ కల్పించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త వెసులుబాటు కాపర్లను అండగా నిలుస్తోంది.మండలంలో గొర్రెలు30,014,మేకల9164,మొత్తం జీవలువ39,178ఉన్నాయి.


మార్కెట్లో డిమాండ్..


చాలా మంది యువకులు,రైతులు వృత్తితోపాటు వ్యాపారంగాను గొర్రెలు,మేకల పెంపకాన్ని ఎంచుకుంటున్నారు.పండుగలు,శుభకార్యాలు,ప్రత్యేక సభలు,హోటళ్లలో మాంసం వినియోగం రోజు రోజుకూ పెరుగుతుండటంతో జీవాల మార్కెట్ కళకళలాడుతోంది.డిమాండ్ కు తగ్గట్టుగానే ధరలు కూడా పలుకుతుండడంతో ఈ రంగం లాభాల బాటలో సాగుతొంది.అయితే గాలికుంటూ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకినప్పుడు లేదా భారీ వర్షాలు,పిడుగులు,వరదల సమయంలో జీవాలు మృత్యువాత పడి పెంపకందార్లు క్షణాల్లో రోడ్డున పడుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి.గతంలో పూర్తిస్థాయి ప్రీమియం భారం మోయలేక ఎంతోమంది పేద పెంపకందార్లు బీమా పథకాలకు దూరంగా ఉండేవారు.జీవాలు చనిపోయినప్పుడు తీవ్రంగా నష్టపోయేవారు.


సద్వినియోగం చేసుకోవాలి..


పెంపకం దారుల దయనీయ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది.పెంపకందార్లు ఒక్కో గొర్రె లేదా మేకకు కేవలం రూ.13ప్రీమియం చెల్లిస్తే సరి పోతుంది.మిగతా బీమా మొత్తాన్ని ప్రభు త్వమే భరిస్తుంది.గత నెల 16న రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించి అధి కారికంగా ప్రకటించారు.ప్రభుత్వం కల్పించిన బీమా అవకాశాన్ని మండలంలోని ప్రతి పెంపకందారు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ అధికారులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్