Magazines

గ్రామాల్లో స్వచ్ఛతపై సర్వే!

1 గంట క్రితం

villages cleanliness
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 2 నిమిషాల చదవడం


మండలంలో 15 గ్రామపంచాయతీలు

నవతెలంగాణ-మల్హర్ రావు.

గ్రామపంచాయతీల్లో స్వచ్ఛత అమలు తీరుపై ప్రత్యేక బృందాలు తనిఖీలు చేయనున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం,ఘన,ద్రవ,వ్యర్థాల నిర్వహణపై వాస్తవ పరిస్థితులను ప్రత్యేక బృందాలు ఆరాతీస్తాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ 2.0 కార్యక్రమంలో భాగంగా 'స్వచ్చ సేవా ఆంకాలన్' పేరిట పంచాయతీ యంత్రాంగం మొదట స్వచ్ఛతపై స్వీయ మదింపు చేసి అక్టోబర్ నెలాఖరులోగా వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు.అనంతరం కేంద్రబృందాలు క్షేత్రస్థాయిలో సర్వేచేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తాయి.మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.స్వచ్ఛభారత్ రికార్డుల ప్రకారం అన్ని గ్రామాలు బహిరంగ మల విస ర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాలుగా ప్రకటిం చాయి.కానీ సగం గ్రామాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా దర్శనమిస్తున్నాయి.గత ఏప్రిల్,మే నెలలో తొలిదశ జనగణనలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు.చాలా ఇళ్లలో అసలు మరుగుదొడ్లు లేవన్న విషయం బయటపడింది.అప్పట్లో ఎన్ఆర్ఈజిఎస్ లో మరుగుదొడ్లు నిర్మించుకొని బిల్లులు తీసుకున్నట్లు రికార్డులు ఉన్నాయి.కొన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకున్నా వినియోగించడం లేదని తేలింది.గ్రామాల్లో బహిరంగ మల విసర్జనతో కలిగే నష్టాలను గురించి మరోమారు ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించినా చాలా గ్రామాల్లో చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయడం లేదు.

వివరాలు నమోదు చేయాలి..

స్వచ్ఛ సేవా ఆంకాలన్ (ముదింపు) కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు,ఘన,ద్రవ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రశ్నావళిని పూరించాలి.సామాజిక మరుగుదొడ్ల వద్ద సబ్బుతో చేతులు కడుక్కునే సదుపాయం ఉందా? విద్యుత్తు కనెక్షన్ ఇచ్చారా? పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీలు,ప్రభుత్వ కార్యాలయాల వద్ద శౌచాలయాలు ఉన్నాయా.?తాగునీరు,పారిశుద్ధ్యం కమిటీలు సమావేశం అవుతు న్నాయా? బహిరంగ మలవిసర్జనతో కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేలా పేయింటింగ్స్ వేశారా? వంటి వివరాలు పొందుపర్చాలి.అక్టోబర్ నెలాఖ రులోగా గ్రామసభలో ధ్రువీకరించాలి. నవంబర్ 20లోగా దాన్ని జిల్లా స్థాయి కమిటీ పరిశీలిస్తుంది.అనంతరం నివే దిక ఆధారంగా కేంద్ర బృందాలు సర్వే చేస్తాయి.అన్ని గ్రామాల్లో ఓడీఎఫ్ అమలవుతోందా, ఏయే గ్రామాల్లో ఇంకా పరిస్థితి మెరుగుపడాలి అనే అంశాల పై సర్వే చేస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్