Magazines

తాడిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

48 నిమిషాల క్రితం

gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి, కార్యాలయం ఆవరణలో ఉన్న విగ్రహానికి ఎంపిడిఓ క్రాoతి కుమార్, సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ సేవలను స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గంలో గాంధీజీ చూపిన బాటను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎపిఓ మల్లిఖార్జున రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మహేందర్, ఎపిఓ హరీష్, ఆపరేటర్ మహేష్, వార్డు సభ్యులు, ఎంపిడిఓ, విబిజి రాంజి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్