- రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ ఏర్పాటుకు చర్యలు
- విశ్వనాథపురంలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
నవతెలంగాణ - గీసుకొండ
రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు ఆదివారం స్థల పరిశీలన చేపట్టారు. గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలోని ప్రతిపాదిత స్థలాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పులి ప్రియాంక, సంబంధిత అధికారులు పరిశీలించారు.
రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, పండ్ల ఉత్పత్తుల విక్రయానికి అనువైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా స్థలాన్ని పరిశీలించారు. ప్రతిపాదిత స్థల విస్తీర్ణం, రహదారి సౌకర్యం, రవాణా, మౌలిక వసతుల లభ్యత తదితర అంశాలను పరిశీలించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులు సూచించారు. రైతులు తమ పండ్ల ఉత్పత్తులను సులభంగా విక్రయించుకునేలా అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్.కిషోర్‌కుమార్, వరంగల్ ఆర్డీవో సుమ, జిల్లా ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, మార్కెటింగ్ డైరెక్టర్ రుద్రప్రసాద్, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)