Magazines

సర్ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన

54 నిమిషాల క్రితం

malahar rao
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

మండలంలోని కొయ్యుర్ ప్రభుత్వ పాఠశాలలో సర్ ప్రక్రియపై ఆదివారం ఆర్ఐ నరేశ్, స్వర్ణలత, సరిత మహిళలకు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొయ్యూరు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ హాజరై మాట్లాడారు. గ్రామంలో ఎవరికైతే ఓటరు జాబితాకు సంబంధించి నోటీసులు వచ్చాయో వారు వెంటనే స్పందించి తమ ఆధార్, రేషన్ కార్డు ఇతర పత్రాలతో తమ తప్పులను సరి చేసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని, ప్రతి పౌరుడి బాధ్యతని సూచించారు. ఈ కార్యక్రమంలో రజిత, మహేందర్, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్