Magazines

ఉత్తమ టీచర్ల ఎంపికకు కసరత్తు పూర్తి..

03 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 1 నిమిషాల చదవడం


15 ఏళ్ల బోధనా అనుభవానికి ప్రాధాన్యం

నవతెలంగాణ - మల్హర్ రావు

ఈ ఏడాది జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు విద్యా శాఖ కసరత్తు చేసింది.ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించనున్నారు.ప్రతి మండలం నుంచి అన్ని కేటగిరీలను పరిగణనలోకి తీసుకుని ఇద్దరు చొప్పున ఉపాధ్యాయుల నామినేషన్లు పంపిం చాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేసింది.

సీనియర్లకు ప్రాధాన్యం..

ప్రభుత్వ,స్థానిక సంస్థలు,ఎయిడెడ్ పాఠశాలల్లో కనీసం 15 సంవత్సరాల బోధనా అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.అయితే కేవలం సీనియారిటీ కాకుం డా అన్ని విభాగాల్లో వారి సేవలను పరిశీలించను న్నారు.ఇప్పటికే జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపా ధ్యాయ అవార్డు పొందిన వారు ఈ ఎంపికకు అర్హులు కాదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

మూడేళ్లలో చేసిన సేవలకు..

2023-24,2024-25,2025-26 సంవత్సరాల్లో వన మహోత్సవం కార్యక్రమంతోపాటు మండల,జిల్లా,రాష్ట్ర స్థాయి సెమినార్లలో పేపర్ ప్రజెంటేషన్లు చేయడం,పరిశోధనలు చేపట్టటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు,ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠ్య ప్రచురణలకు రచయితలు,ఎడిటర్లుగా,మండల, జిల్లా,రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా సేవలందించిన వారి ప్రతిభను కూడా పరిశీలించనున్నారు.

ముగ్గురు సభ్యులతో కమిటీ..

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు మండల స్థాయిలో తహసీల్దార్ చైర్మన్ గా,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సభ్యుడిగా, మండల విద్యాధికారి మెం బర్ కన్వీనర్ గా ముగ్గురితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ ఇద్దరు ఉపాధ్యాయు లను ఎంపిక చేసి డీఈఓకు ప్రతిపాదనలు పంప నుంది.ఎంపికైన అభ్యర్థులు తమపై ఎలాంటి ఆరోపణలు,కోర్టు కేసులు లేవని,ఇంతవరకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందలేదని డిక్ల రేషన్ ఆగస్టు 30లోపు సమర్పించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్