టి యు డబ్ల్యూ జే వన్ ఫోర్ త్రీ జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య
నవతెలంగాణ-నెల్లికుదురు
టీయూడబ్ల్యూజే -143 నెల్లికుదురు మండల కమిటీని జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య కోకన్వీనర్ గాడిపెల్లి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జంపాల చక్రధర్ తెలిపారు. జిల్లా కమిటీ సమక్షంలో బుధవారం ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే 143 మండల కమిటీ అధ్యక్షునిగా మన తెలంగాణ విలేఖరి మద్ది వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా సాక్షి విలేఖరి బైరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఆంధ్రజ్యోతి విలేఖరి మల్యాల నర్సయ్య, సహాయ కార్యదర్శిగా నమస్తే తెలంగాణ విలేకరి మస్కపురి సుధాకర్, కోశాధికారిగా వార్త విలేకరి జెల్ల ఉపేందర్, కమిటీ సభ్యులుగా ప్రజా జ్యోతి విలేకరి పోరాండ్ల లక్ష్మయ్య, బహుజన టీవీ విలేఖరి జిలకర శ్రీధర్ ను ఎంపిక చేశారు.







కామెంట్‌లు (0)