Magazines

భారీగా పెరిగిన నిర్మాణ ఖర్చులు

03 సెప్టెంబర్, 2026

Construction costs
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 04, 2026 | 2 నిమిషాల చదవడం

ఐదేండ్లలో ఇండ్ల ధరలు 59 శాతం భారం : అన్‌‌రాక్‌ రిపోర్ట్‌

న్యూఢిల్లీ : దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత ఐదేండ్ల( 2021-2025 మధ్య) కాలంలో దేశంలోని టాప్-7 నగరాల్లో ఇండ్ల ధరలు ఏకంగా 59 శాతం మేర పెరిగినట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే కాలంలో నివాస గృహాల నిర్మాణ వ్యయం కేవలం 34 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. నిర్మాణ ఖర్చుల కంటే విక్రయ ధరల పెరుగుదల మధ్య ఏకంగా 25 శాతం వ్యత్యాసం ఉంది. పెరిగిన భూముల ధరలు, ప్రాంతం ప్రాధాన్యత, మార్కెట్ డిమాండ్ కారణంగా భవనాల నిర్మాణ ఖర్చుకు, అమ్మకపు ధరలకు మధ్య దూరం మరింత పెరిగిందని.. ఇది గృహ కొనుగోలుదారులకు తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోందని అనరాక్ హెచ్చరించింది.ఈ ఐదేండ్ల కాలంలో ప్రామాణిక నివాస ప్రాజెక్టుల నిర్మాణ సగటు వ్యయం చదరపు అడుగుకు రూ.2,681 నుంచి రూ.3,604కి పెరిగింది. సంవత్సరానికి సగటున 6.9 పెరుగుదల నమోదయ్యింది. ఇదే సమయంలో ఇండ్లకు సగటు పెట్టుబడి విలువ చదరపు అడుగుకు రూ.5,826 నుంచి రూ. 9,260కి ఎగబాకింది.

సగటున సంవత్సరానికి ఇండ్ల ధరలు 12 శాతం చొప్పున పెరిగాయి. ఈ ధరల పెరుగుదలలో 66 శాతం వాటా నిర్మాణ ఖర్చులదే కాగా, మిగిలిన 34 శాతం బాహ్య ఒత్తిళ్లు అనగా విపరీతంగా పెరిగిన భూముల ధరలు, డెవలపర్ల మార్జిన్లు, డిమాండ్, సరఫరా పరిస్థితుల కారణంగా సంభవించిందని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మె న్ సంతోష్ కుమార్ తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఉక్కు, ఇంధన రవాణా వ్యయం, దిగుమతి చేసుకున్న మెటీరియల్స్ ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయని.. ఇది మొత్తం నిర్మాణ వ్యయాన్ని అదనంగా 8-10 శాతం పెంచిందని ఆయన పేర్కొన్నారు. సిమెంట్, ఉక్కు, కార్మికుల ఖర్చులతో సంబంధం లేకుండా ప్రధాన నగరాల్లో భూముల విలువ లు 2021 నుంచి 2026 ప్రథమార్థం వరకు 50 నుంచి 120 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా జాతీయ రాజధాని ప్రాంతం ఎన్‌‌సిఆర్‌ లో 70-130 శాతం, బెంగళూరులో 60-120 శాతం మేర భూముల ధరలు భారీగా పెరిగిన ట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిణామాల ప్రభావం ప్రధానంగా సరసమైన, మధ్యతరగతి గృహ కొనుగోలుదారులపై ఎక్కువగా పడనుందని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్