Magazines

ఎలక్షన్‌ కమిషన్‌ 
ఠీక్‌ కరో

44 నిమిషాల క్రితం

Election Commission, set things right.
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

సీఈసీ రాజీనామా చేయకుంటే దేశవ్యాప్త ఆందోళన

2 నుంచి ముంబయిలో ప్రారంభిస్తాం: సీజేపీ క‌న్వీన‌ర్ అభిజీత్ దీప్కే


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయకపోతే అక్టోబర్‌ 2 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. శుక్ర‌వారం సీజేపీ క‌న్వీన‌ర్‌ అభిజీత్‌ దీప్కే ఈ ప్రకటన చేశారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ముంబయిలో ఆందోళన ప్రారంభించి, అనంతరం దేశంలోని ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘ఎలక్షన్‌ కమిషన్‌ ఠీక్‌ కరో’ పేరుతో దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు రాజీనామా చేయడానికి శనివారం వరకు గడువు విధించినట్టు దీప్కే చెప్పారు. రాజీనామా చేయకపోతే అక్టోబర్‌ 2 నుంచి ముంబయిలో ఉద్యమాన్ని ప్రారంభిస్తామనీ, దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో తదుపరి దశలో నిరవధిక ఆందోళన, ‘జంతర్‌మంతర్‌ 2.0’ చేపడతామని తెలిపారు.


సర్‌పై ఆరోపణలు
సర్‌తో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి భారీ సంఖ్యలో పేర్లు తొలగించబడ్డాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లు ప్రభావితమయ్యాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో ఎందుకు పాల్గొంటున్నాయంటూ దీప్కే ప్రశ్నించారు. ఎన్నికలు అవకతవకలకు గురవుతున్నాయని భావిస్తే వాటిలో పాల్గొనడంతో ఆ ప్రక్రియకు చట్టబద్ధత కల్పించినట్టవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది సీజేపీ క‌న్వీన‌ర్‌ రాజకీయ అభిప్రాయంగా చూడాల‌ని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్