Magazines

పదవిలో కొనసాగే నైతిక హక్కులేదు

1 గంట క్రితం

There is no moral right to continue in office.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

జ్ఞానేశ్ ‌ కుమార్‌ను 
కాపాడేందుకు తీవ్ర యత్నాలు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ
ఢిల్లీలోని ఏకేజీ భవన్‌ నుంచి గోల్‌ మార్కెట్‌లోని భగత్‌సింగ్‌ పార్క్‌ వరకు ప్రదర్శన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కు లేదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ అన్నారు. ప్రజాస్వామ్య రంగంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొం టున్నప్పటికీ ఎలాంటి సిగ్గూ, బాధ్యతా భావం లేకుండా పదవిని పట్టుకుని వేలాడటం అల్పత్వానికి నిదర్శనమని విమర్శించారు. జ్ఞానేశ్ ‌ కుమార్‌ను కాపాడేందుకు నరేంద్ర మోడీ, అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భగత్‌సింగ్‌ 119వ జయంతి సందర్భంగా దేశ ప్రజల ఓటు హక్కును కాపాడతామని ప్రకటిస్తూ సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) ప్రదర్శన నిర్వహించింది. ఢిల్లీలోని ఏకేజీ భవన్‌ నుంచి గోల్‌ మార్కెట్‌లోని భగత్‌సింగ్‌ పార్క్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భగత్‌సింగ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్‌కు, జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఏ బేబీ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ త్యాగం, స్ఫూర్తి ..సర్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. దేశ ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బేబీ ప్రకటించారు. జ్ఞానేశ్ ‌కుమార్‌ను పదవి నుంచి తొలగించడంతోపాటు, సర్‌ పేరుతో జరుగుతున్న ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై సెప్టెంబర్‌ 30న జరిగే ఇండియా బ్లాక్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. నేడు (మంగళవారం) వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆర్‌. అరుణ్‌కుమార్‌, ఎంపీలు‌ వి. శివదాసన్‌, ఎ.ఎ. రహీం, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్‌ సక్సేనా, కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్‌సింగ్‌, మురళీధరన్‌, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్