తప్పించుకున్న మహిళ,
పోలీసులకు
ఫిర్యాదు
నవతెలంగాణ-శంషాబాద్
మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన ఒంటరి మహిళ.. ఈ నెల 26న హైదరాబాద్‌లోని తన బంధువుల వద్దకు రావడానికి దేవరకొండ నుంచి జడ్చర్లకు వచ్చింది. అక్కడ హైవేపై నిలిచి ఉన్న సమయంలో ఒక క్యాబ్ డ్రైవర్ తన కారులో హైదరాబాద్ వెళ్తున్నానని ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. శంషాబాద్‌లోని తొండుపల్లి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్దకు రాగానే హైదరాబాద్ వెళ్లకుండా అక్కడి నుంచి రాల్లగూడ సర్వీస్ రోడ్డు మీదుగా నర్కూడ వైపు వెళ్ళాడు. ఆమెపై లైంగిక దాడి చేయడానికి అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మళ్లీ వెనుదిరిగి రాల్లగూడ నుంచి కొత్వాల్‌గూడ సర్వీస్ రోడ్డు వైపు తీసుకెళ్లాడు. కారును నిర్మాణుష్య ప్రదేశంలోకి తీసుకెళ్ళి, ఆమెపై లైంగికదాడికి యత్నించగా.. ఆమె అడ్డుకున్నది. దీంతో ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆమె తన వెంట తెచ్చుకున్న రూ.60 వేలు కారులోనే ఉన్నాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కారు నెంబర్ ఆధారంగా నిందితుని చిరునామా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే వికారాబాద్ జిల్లా వైపు చూపిస్తున్నది. అతన్ని పట్టుకోవడానికి రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం
53 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)