Magazines

జ్ఞానేశ్‌ కుమార్‌‌ను అరెస్ట్ చేయాలి

50 నిమిషాల క్రితం

Gyanesh Kumar must be arrested.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహ
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు ర్యాలీ
నవతెలంగాణ-హిమాయత్ నగర్
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ ను అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహ డిమాండ్ చేశారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్నికల కార్యాల యం బీఆర్కే భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ సీపీఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని బారికేడ్లతోపాటు కమిషనర్‌ కార్యాలయ గేట్లకు తాళాలు వేశారు. దీంతో తోపులాట జరిగింది. కార్యకర్తలు బారికేడ్లు దాటుకుని కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. జ్ఞానేశ్‌ కుమార్‌ను అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు కూర్చున్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్ష పాతం గా ఎలాంటి ఒత్తిడులకూ లోనుకాకుండా పనిచేయాలన్నారు. కానీ మోడీ ప్రభుత్వం 2023 లో ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబం ధించిన చట్టంలో మార్పులు చేసిందని తెలిపారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకు గతంలో ఉన్న విధానాలను మార్చడం సరికాదన్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో.. ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధాన మంత్రి నామినేట్‌ చేసే కేంద్ర క్యాబినెట్‌ మంత్రి సభ్యులుగా ఉంటారని చట్టం పేర్కొంటోందని వివరించారు. ఎన్నికల కమిషనర్ల నిర్ణయాలు, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. ఇక ఓటర్ల జాబితాలో మార్పులు నూతన ఓటర్లను చేర్చడం వంటి నిర్ణయాలు ప్రధాన కమిషనర్ తో పాటు మిగతా ఇద్దరు కమిషనర్లు కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కానీ జ్ఞానేశ్‌ కుమార్ ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో తన ఇష్టారాజ్యంగా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ ఓటర్ల ప్రక్రియకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా రూపొందిం‌ చారని విమర్శించారు. జ్ఞానేశ్‌ కుమార్‌పై తమకు ఉన్న అభ్యం తరాలను పరిశీలించి సుప్రీంకోర్టు తగిన విధం గా జోక్యం చేసుకోవాలని కోరారు. కార్య క్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌.ఛాయాదేవి, సీనియర్‌ నాయకురాలు పి.ప్రేమ్‌ పావని, సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు బి.వెంకటేశం, నేర్లకంటి శ్రీకాంత్‌, కాంపల్లి శ్రీనివాస్‌, మామిడి చెట్ల వెంకటస్వామి, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్