Magazines

ఫోటోగ్రఫీ విజేతలకు నగదు బహుమతుల ప్రదానం

44 నిమిషాల క్రితం

Cash prizes awarded to photography winners
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణను ఫోటోగ్రఫీ ద్వారా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌‌టీసీసీఐ) టూరిజం కమిటీ ‘తెలంగాణ త్రూ ది లెన్స్ – 2026’ ను నిర్వహించింది. టూరిజం ఫోటోగ్రఫీ పోటీలో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. సోమవారం హైదరాబాద్‌ రెడ్ హిల్స్‌లోని ఎఫ్‌‌టీసీసీఐ కార్యలయంలో ఈ కార్యక్రకమం జరిగింది. ఈ సంస్థ అధ్యక్షులు కె.కె. మహేశ్వరి విజేతలకు అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్‌, మరో ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గరిమెళ్ల విజేతలకు నగదు స్పాన్సర్ చేసిన రాధా‌ టీఎంటీ నేషనల్ సేల్స్ మేనేజర్ సుభాష్ చౌదరి, టూరిజం కమిటీ చైర్మెన్‌ ప్రకాష్‌ అమ్మనబోలు, కో-చైర్మెన్‌ డి. రామచంద్రం, ఎఫ్‌‌టీసీసీఐ డైరెక్టర్ సంగీత, టూరిజం కమిటీ సభ్యులు నాగేష్ పాంపాటితోపాటు జ్యూరీ సభ్యులు ది హిందూకు చెందిన మాజీ చీఫ్ న్యూస్ ఫోటో జర్నలిస్ట్ హెచ్. సతీష్, నవ తెలంగాణ చీఫ్‌ ‌ఫోటోగ్రాఫర్‌, తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కె.ఎన్. హరి తదితరులు పాల్గొన్నారు. ‘తెలంగాణ త్రూ ది లెన్స్ – 2026’ విజేతలు తెలంగాణ పర్యాటక వైవిధ్యాన్ని తమ కెమెరాల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఎఫ్‌‌టీసీసీఐ ఇచ్చిన పిలుపునకు స్పందించి తెలంగాణను పర్యాటక దృక్కోణంలో అన్వేషించిన ఫోటోగ్రాఫర్లలోS1 స్టూడియోస్ ఫోటోగ్రాఫర్ శ్రవణ్ తాడన్ల ప్రథమ బహుమతి సాధించారు. మహిమల కయధర్ రెడ్డి తరఫున కుమారి సౌమ్య ద్వితీయ బహుమతి అందుకున్నారు. హెచ్. సతీష్ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప గ్రామంలో S1 స్టూడియో నిర్వహిస్తున్న శ్రవణ్ తాడన్ల, తెలంగాణకు చెందిన చెరియాల్ పెయింటింగ్ పై తీసిన ఫోటోకు ప్రథమ బహుమతి సాధించారు. చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ తెలంగాణకు చెందిన ప్రాంతీయ కోణంతోపాటు అంతరించిపోతున్న జానపద కళారూపాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ప్రస్తుతం ఈ కళారూపం కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ఏడుగురు ఫోటోగ్రాఫర్లు కన్సొలేషన్ బహుమతులు అందుకున్నారు. కిషోర్ దాస్, కత్రోజు యాదగిరి, వొంటెద్దు నాగేశ్వరరావు, బషీర్, తులా నరేందర్, ఆవుల శ్రీనివాసులు, వీరగోని రజనీకాంత్ గౌడ్ ఇందులో ఉన్నారు. వీరి ఫోటోలు తెలంగాణ పర్యాటక రంగంలోని విభిన్న కోణాలను ఆవిష్కరించాయి. రాష్ట్రంలోని దృశ్య వైవిధ్యంతో పాటు, ఇంకా పెద్దగా ప్రాచుర్యం పొందని పర్యాటక ఆకర్షణలను గుర్తించేందుకు, డాక్యుమెంట్ చేయడానికి, ప్రచారం చేయడానికి ఫోటోగ్రఫీకి ఉన్న సామర్థ్యాన్ని ఈ చిత్రాలు చాటిచెప్పాయి. ఈ పోటీలో ప్రథమ బహుమతిగా రూ.15,000, ద్వితీయ బహుమతిగా రూ. 10,000, తృతీయ బహుమతిగా రూ.7,500 అందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్