నవతెలంగాణ హైదరాబాద్: నేపాల్‌లోని హిమ్లుంగ్ హిమాల్ బేస్ క్యాంప్ వద్ద భారీ హిమపాతం సంభవించింది. ఈ ఉపద్రవం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 15కి చేరింది.మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు.తాజాగా మరో 8మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. మానాంగ్ జిల్లాలో 7,126మీటర్ల ఎత్తైన హిమ్లుంగ్ హిమాల్ పర్వతం ఉంది. విదేశీ పర్వతారోహకులు శిఖరాన్ని అధిరోహించేందుకు కార్మికులు బేస్ క్యాంప్ ను సిద్ధం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.





కామెంట్‌లు (0)