Magazines

పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

2 గంటల క్రితం

Patta lands should be removed from the prohibited list.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

భూములు గుంజుకున్నాక మా జీవితమెందుకు..: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రైతులు, వ్యవసాయ కూలీలు
వెంటనే ఆన్‌‌లైన్‌ చేయాలి... ఫార్మాసిటీ జీవోను రద్దు చేయాలి
ఫార్మా ప్లాట్లు ఇచ్చేవరకూ భూముల జోలికి రావద్దు : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఫార్మాసిటీ బాధిత రైతుల ధర్నా
నవతెలంగాణ-యాచారం: ఫార్మాసిటీ పేరుతో తీసుకున్న దాదాపు 2600 ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొల గించాలని ఫార్మా ఉద్యమ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త, తాడిపర్తి, కుర్మిద్ధ, నానక్ నగర్ గ్రామాల రైతులు, వ్యవసాయ కూలీలు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఫార్మాసిటీ పోరాట వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేశారు. ఎన్నికల ముందు రైతులను నమ్మించి ఓట్లు వేసుకొని గద్దెనెక్కారని రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేసి మంచాల పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, భూభారతి ద్వారా ఆన్‌‌లైన్‌ చేసి రైతులందరికీ పూర్తి హక్కులు కల్పించాల ని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ జీవోను రద్దు చేయాలని కోరారు. ఎర్రటి ఎండను లెక్కచేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకం గా రైతులంతా ధర్నాకు దిగారని చెప్పారు. ఫార్మా ప్లాట్లు ఇవ్వకుండా రైతులను ప్రభుత్వం, అధికారులు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట టెంటు వేయనీయకుండా పోలీసులు అడ్డుపడి అరెస్టు చేశారని తెలిపారు. ఏదేమైనా ఫార్మా రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని రాష్ట్ర ప్రభుత్వా న్ని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫార్మాసిటీని రద్దుచే సి, నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆన్‌‌లైన్‌ చేయాలని తెలిపారు. తమ భూములు గుంజుకున్నాక‌తమ జీవితమెందుకని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా ప్లాట్లు ఇచ్చేవరకూ భూముల జోలికి రావొద్దని సూచించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, నాలుగు గ్రామాల రైతులు, వ్యవసాయ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్