Magazines

నేడు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

1 గంట క్రితం

State Cabinet meeting today.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

మెట్రో ఫేజ్‌-1 స్వాధీనంపై కీలక నిర్ణయం
రాజీవ్ యువ వికాసం విధి, విధానాలపై చర్చ
మూసీ రివర్ ఫేజ్-1పూర్తిపై సమాలోచనలు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ర్ట మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌‌లోని ‌బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి అధ్యక్ష‍తన జరుగనున్న భేటీలో విధానపరమైన, రాజకీయ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. గ్లోబల్ సమ్మిట్-2027 నిర్వహణ, హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 స్వాధీనం, ఫేజ్‌-2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది. అలాగే మూసీ రివర్ ఫేజ్-1పూర్తి, ప్రాజెక్టు భూసేకరణ, ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం,

నిధులు, అనుమతులు, ఇందిరమ్మ చీరల పంపిణీపై క్యాబినెట్‌ ‌కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల డీఏ, పీఆర్‌‌సీ, పెండింగ్ బిల్లులచెల్లింపులు, పరిపాలన, సంక్షేమంపై మంత్రి వర్గం చర్చించనుందని సమాచారం. రాజీవ్ యువ వికాసం పథకం విధి, విధానాలపై చర్చించి ప్రారంభ తేది ప్రకటించే అవకాశం ఉంది. ఎల్‌‌నినో ప్రభావం, సింగరేణి థర్మవిద్యుత్‌ ‌కేంద్రాల్లో బొగ్గు కొరత, తుమ్మిడి హట్టిపై ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సీఎం సమావేశం తదితర పరిణామాలపై కూడా మంత్రి వర్గం చర్చించనున్నట్టు సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్