భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకురానుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తుండగా, గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించ నుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని తొలి పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. తాజాగా ‘కొండ కోన కోరసు’ పాడే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటని చరణ్ అర్జున్ స్వయంగా సాహిత్యం అందించి ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. అనన్య భట్, చరణ్ అర్జున్ పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. గరివిడి లక్ష్మి మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని తదితరులు నటిస్తున్నారు.
వెండితెరపై గరివిడి లక్ష్మి జీవితం
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)