Magazines

త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తాం

49 నిమిషాల క్రితం

committees soon
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 1 నిమిషాల చదవడం

ఆంధ్రప్రదేశ్ సినీ, టీవీ, నాటక రంగాల నంది అవార్డులకు సంబంధించి ఇటీవల ఏపీ ఎఫ్డిసి నుండి ప్రకటన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్, ఎఫ్డిసి సభ్యులు బుర్ర సాయి మాధవ్, మీర్, టీవీ అండ్‌ ఓటీటీ సౌత్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు, టీవీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్ర టరీ తుమ్మల ప్రసన్న కుమార్, టీవీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భరత్‌ భూషణ్‌ మాట్లాడుతూ, ‘నంది అవార్డుల వేడుకను తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సమక్షంలో నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే టీవీ రంగానికి సంబంధించిన పలు ప్రోగ్రాములు, షూటింగులు ఏపీలో జరిగే విధంగా చూస్తాం’ అని తెలిపారు. టీవీకి సంబంధించిన షూటింగ్‌లను ఏపీలోనే చేస్తామని, అయితే దీనికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని, వీటితో పాటు ఏపీలో తమకంటూ స్టూడి యోల కోసం స్థలాన్ని, షూటింగ్లో పర భాష నటీ నటులను కూడా మితం చేయాలని, ముఖ్యంగా ఆర్టిస్టుల ఆరోగ్యం కోసం ఇన్సూ రెన్స్లు, పెన్షన్లు అందించాలి. షూటింగ్ జరిగే సమయంలో సబ్సిడీలు ఇచ్చేలా చూడాలని, నిర్మా తలకు తక్కువ ఖర్చులో షూటింగ్‌ పూర్తి చేసేందుకు సహాయంగా నిలవాలని టీవీ రంగం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్‌ భూషణ్‌ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కమిటీలు వేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్