Magazines

మరో పవర్‌ఫుల్‌ కథతో..

03 సెప్టెంబర్, 2026

powerful story
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 1 నిమిషాల చదవడం

కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కొత్త సినిమా ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించ నున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఆర్‌కేఎఫ్‌ఐ (రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్), టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమా వరల్డ్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్‌లో కమల్ హాసన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గడ్డంతో, బ్లాక్ షర్ట్, ఆలివ్ గ్రీన్ ట్రౌజర్స్‌లో కనిపి స్తున్నారు. పవర్‌ఫుల్‌గా కనిపించే లుక్‌కు చేతిలో పట్టుకున్నఆయుధం మరింత ఇంటెన్స్‌నెస్ తీసుకొచ్చింది. ఎంతో కూల్‌గా కనిపిస్తూనే, భారీ ఆయుధంతో నడుస్తున్న కమల్ హాసన్ లుక్.. ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తిని కలిగి స్తోంది. కమల్‌ లుక్‌ టెస్ట్‌ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ‘సేతుపతి’, ‘చిత్తా’ వంటి సినిమాల తో ఎస్.యు. అరుణ్ కుమార్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్నారు. ఆయన కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడం ఈ కొత్త ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్