Magazines

సిమ్‌ దుర్వినియోగానికి రూ.50లక్షల జరిమానా

4 రోజుల క్రితం

sim-card
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : తమ పేరు మీద జారీ అయిన సిమ్ కార్డులను ఇతరులకు వాడటానికి ఇవ్వవద్దని టెలికమ్యూనికేషన్‌ విభాగం మొబైల్ వినియోగదారులను హెచ్చరించింది. మోసపూరిత విధానాల్లో సిమ్ జారీ, IMEI నంబర్లను తారుమారు చేయడం వంటివి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని పేర్కొంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే రూ.50 లక్షల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని పేర్కొంది. పౌరులు సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ గుర్తింపుతో ఉన్న అన్ని మొబైల్ నంబర్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని సూచించింది.

తాజా వార్తలు చదవండి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్