Magazines

సిరిసిల్లను బీఆర్‌ఎస్‌ ఉరిసిల్లగా మార్చింది. సీఎం రేవంత్‌రెడ్డి

1 గంట క్రితం

CM Revanth Reddy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సమస్యలకు నిలయంగా సిరిసిల్లను మార్చేశారని ధ్వజమెత్తారు. బుధవారం సీఎం రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..‘‘ దైవం, ధైర్యం  కలిసిన ప్రాంతం సిరిసిల్ల. సిరిసిల్ల అంటే సిరులకు నిలయం. చేనేత కార్మికులకు, వృత్తి నైపుణ్యానికి సిరిసిల్ల పెట్టింది పేరు. అగ్గిపెట్టె చీరతో సిరిసిల్లకు నేతన్నలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని" అన్నారు.


పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లుగా.. కేటీఆర్ కు ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ గురించి అని అన్నారు. కాంగ్రెస్ గురించి, రేవంత్ గురించి ఫామ్ హౌస్ లో పడుకున్న మీ తండ్రి కేసీఆర్‌ను అడుగమని సలహా ఇచ్చారు. సిరిసిల్ల గడ్డమీద గురిపెడదామని సిరిసిల్ల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసారి సిరిసిల్ల గడీని కూల్చేస్తామని హెచ్చరించారు. ఆనాడు గజ్వేల్ గడీని నేలమట్టం చేస్తామని చెప్పినం.. చేసి చూపించాం.. ఈ సారి సిరిసిల్ల గడీని కూల్చేస్తామని చెప్పారు.  

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్