Magazines

మెట్రో-ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు

1 గంట క్రితం

Ministers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌, వెంకటస్వామి (కాకా), ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌లు శనివారం హైదరాబాద్‌ మెట్రోట్రైన్‌, ఆర్టీసీ బస్సులు ప్రయాణించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ రవాణాను మరింత చేరువ చేసేందుకే ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ తీసుకొచ్చినట్టు చెప్పారు. భవిష్యత్తులో దీనిని ఆటో, క్యాబ్‌లకు అనుసంధానం చేసే ఆలోచన చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా డే పాస్‌తో మంత్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో బేగంపేట మెట్రో స్టేషన్‌కు వచ్చినట్ట తెలిపారు. అక్కడి నుంచి మెట్రో టైన్‌లో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు ప్రయాణించినట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్