Magazines

శ్రీసిటీలో బాయిలర్‌ పేలి ఐదుగురు మృతి

52 నిమిషాల క్రితం

Sreecity
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రయివేటు పరిశ్రమలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీసిటీలోని ఓ ప్రయివేటు ఫ్యాక్టరీలో ఉన్న వాటర్ బాయిలర్ శనివారం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వారు కన్నుమూశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్