Magazines

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మృతుల సంఖ్య ఐదుకు

2 రోజుల క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మరో ఇద్దరు పసికందులు మృతిచెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందిన విషయం తెలిసిందే.సోమవారం అర్ధరాత్రి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌, ఏసీ పేలడంతో రిమ్స్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో ఉన్న పలువురు చిన్నారులను సిబ్బంది, సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, బాధ్యతపై కమిటీ విచారణ అనంతరం స్పష్టత రానుంది.

తెలంగాణ వార్తలు



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్